సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కామ్రెడ్ ఉస్తేల వీరారెడ్డి సతీమణి రాములమ్మ (80) బుధవారం ఉదయం కరోనా వ్యాధితో మృతి చెందారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు.
ఆనాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆమె పాల్గొన్నారు . రాములమ్మ చనిపోవడం పార్టీకి తీరని లోటని చింతలపాలెం మండలం సీపీఐ నాయకులు తెలిపారు.
కరోనాతో కామ్రెడ్ ఉస్తేల రాములమ్మ మృతి - corona virus
కరోనా వ్యాధితో కామ్రెడ్ ఉస్తేల రాములమ్మ మృతి చెందారు. ఆమె మరణం పార్టీకి తీరని లోటని చింతలపాలెం మండలం సీపీఐ నాయకులు తెలిపారు.
కరోనాతో కామ్రేడ్ ఉస్తేల రాములమ్మ మృతి
ఇవీ చూడండి: గుర్తుతెలియని వాహనం ఢీకొని లారీ క్లీనర్ మృతి