సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం యడవెల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో కోడె ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన ఏర్పల వెంకన్న వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి కోడెపై పడ్డాయి. విద్యుదాఘాతంతో కోడె అక్కడికక్కడే మరణించింది.
విద్యుదాఘాతంతో వ్యవసాయ కోడె మృతి - విద్యుదాఘాతం వ్యవసాయ ఆవు మృతి
విద్యుదాఘాతంతో వ్యవసాయ కోడె మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం యడవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వ్యవసాయానికి ఆసరాగా ఉన్న కోడె మృతి చెందడం వల్ల యజమాని వెంకన్న, అతని కుటుంబం కన్నీరుమున్నీరైంది.
విద్యుదాఘాతంతో వ్యవసాయ కోడె మృతి
రూ. 45 వేల విలువ గల కోడె చనిపోవడం వల్ల ఆ కోడె యజమాని వెంకన్న కుటుంబం శోకసంద్రంలో మునిగింది. వ్యవసాయానికి ఆసరాగా ఉండే కోడె మృతితో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.