కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో అందరూ స్వీయ నిర్బంధంలో ఉంటే... సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో మాత్రం కొందరు మాకేమీ కాదన్న విధంగా రోడ్లపై వాహనాలతో విహరించారు. రహదారులపైకి వచ్చిన వాహనదారులను పట్టుకుని స్థానిక సీఐ రాఘవరావు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
హుజూర్నగర్లో వాహనదారులకు కౌన్సిలింగ్
జనతాకర్ఫ్యూలో అందరూ ఇంటికే పరిమితమైతే... వారు మాత్రం నిర్మానుష్య రోడ్లపై వాహనాలతో దూసుకెళ్లారు. ఇది గమనించిన పోలీసులు వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది.
Councelling To Motorists
జనతా కర్ఫ్యూ కారణంగా ఎలాంటి వాహనాలు రోడ్లపైకి రాకూడదని... దీనికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ఫ్యూతో పట్టణమంతా బోసిపోగా... తహసీల్దార్ జయశ్రీ, మండల వైద్యాధికారి లక్ష్మణ్, హుజూర్నగర్ ఎస్సై అనిల్ రెడ్డి, మునిసిపల్ అధికారులు తమ సిబ్బందితో కలిసి విధులు నిర్వర్తించారు.
ఇదీ చూడండి :రైతు బజార్లు కిటకిట... ధరలు భగభగ