సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద పత్తి రైతులు ఆందోళన నిర్వహించారు. పత్తిని కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కందులు కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన పత్తి రైతులు
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్య వహిస్తున్నారంటూ రైతులు ఆందోళన చేశారు. రెండు గంటలకు పైగా నిర్వహించిన ధర్నాతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
COTTON FARMERS PROTEST AGAINST NOT BUYING COTTON AT CCI CENTERS
సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన పత్తిలో నాణ్యత లేదని సుమారు రెండు క్వింటాళ్లు తీసేస్తున్నారని వాపోయారు. ప్రతీ రైతుకు దాదాపుగా రూ. 11 వేల నష్టం కలిగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పత్తిని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాదాపు రెండు గంటలకు పైగా కొనసాగిన ధర్నా వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.