తెలంగాణ

telangana

ETV Bharat / state

పుర పనుల్లో టెండర్ల గోల్​మాల్.. రూ.21 లక్షల అవినీతి - కౌన్సిలర్ల నిరసన

హుజూర్​ నగర్ మున్సిపాలిటీ ప్రజలంతా ఇళ్లలో ఉన్న సమయంలో టెండర్లు లేకుండానే బిల్లులు ఎలా వేస్తారని అధికార పార్టీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు కమిషనర్​ను నిలదీశారు. సరైన సమాధానం చెప్పే వరకు ఇక్కడ్నుంచి కదలమని కమిషనర్ గది ముందు బైఠాయించారు.

టెండర్లే పిలవకుండా బిల్లులెలా వేశారు ?
టెండర్లే పిలవకుండా బిల్లులెలా వేశారు ?

By

Published : May 4, 2020, 6:14 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్ మున్సిపాలిటీ పనుల్లో అవినీతి జరిగిందంటూ స్వయంగా అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు పుర కమీషనర్​కు ఫిర్యాదు చేశారు. పట్టణ ప్రగతి పనుల్లో మురుగు కాల్వల రోడ్డు పక్కన తొలిగించిన మట్టిని 100 రూపాయలకే ట్రాక్టర్ లోడ్ విక్రయించారని ఆరోపించారు. ఓవైపు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదన్న ప్రభుత్వ నిబంధనలుండగా ఇదే అదనుగా టెండర్లు పిలవకుండానే పనులు చేసి బిల్లులు తీసుకుంటున్నారని అన్నారు.

సుమారు 21 లక్షల రూపాయల మేర అవినీతి చోటు చేసుకుందన్నారు. కమీషనర్ సమాధానం చెప్పే వరకు ఇక్కడ్నుంచి కదిలేది లేదని కార్యాలయం ముందు, కింద కూర్చొని కౌన్సిలర్లు నిరసన తెలిపారు.

ఇవీ చూడండి : వలస కార్మికుల రైల్​ టికెట్​పై రాజకీయ రగడ

ABOUT THE AUTHOR

...view details