తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి జిల్లాలో గత పది రోజుల్లో 809 కరోనా కేసులు - ఉమ్మడి జిల్లాలో గత పది రోజుల్లో 809 కరోనా కేసులు

ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా విజృంభిస్తున్నాయి. గత పది రోజుల్లో మూడు జిల్లాల పరిధిలో మొత్తం 809 కేసులు నమోదవగా.. పరిస్థితి తీవ్రంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఆగస్టు నెలలోనే రికార్డు స్థాయిలో కేసులు వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.

covid-19 cases update in nalgonda district
ఉమ్మడి జిల్లాలో గత పది రోజుల్లో 809 కరోనా కేసులు

By

Published : Aug 12, 2020, 12:45 PM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ.. మూడు జిల్లాల పరిధిలో గత పది రోజుల్లోనే 809 కేసులు నమోదవం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. నిత్యం 70-100 మందికి కరోనా పాజిటివ్​ కేసులు నిర్ధరణ అవుతున్నాయి.

గత పది రోజుల్లో నల్గొండ జిల్లాలో 414 కేసులు నమోదవగా.. సూర్యాపేట జిల్లాలో 248, యాదాద్రి భువనగిరి జిల్లాలో 147 నిర్ధరణయ్యాయి. ఈ నెల 4, 10 తేదీల్లో వంద మార్కును దాటగా... 1,5,8 తేదీల్లో 90కి పైగా కేసులు తేలాయి. అన్ని ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి చెందగా ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. వ్యాధి వెలుగుచూసిన తొలినాళ్లతో పోలిస్తే.. ఆగస్టు నెలలోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:'కోజికోడ్​ విమానాశ్రయ రన్​వే సురక్షితమైనదే'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details