నాగార్జునసాగర్‌కు వరద ఉద్ధృతి కొనసాగుతుంది. 26 గేట్ల ద్వారా పులిచింతలకు నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి 6 లక్షల 19 వేల 83 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. 4 లక్షల 58 వేల 805 క్యూసెక్కుల్ని దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు కాగా... ప్రస్తుతం 582.4 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు... ప్రస్తుతం 289.93 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుండను తలపిస్తోంది.
ఉద్ధృతంగా కృష్ణమ్మ... మట్టపల్లి ఆలయంలోకి నీరు
నాగార్జునసాగర్‌కు వరద ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇన్‌ఫ్లో 6 లక్షల 19 వేల 83 క్యూసెక్కులు...ఔట్ ఫ్లో 4 లక్షల 58 వేల 805 క్యూసెక్కులుగా ఉంది. 26 గేట్ల ద్వారా దిగువకు నీటిని వదులుతున్నారు.
పదేళ్ల తర్వాత వస్తున్న వరదతో... మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నీరు నిలిచింది. ఉదయం నుంచి మోటార్ల ద్వారా నీటిని బయటకు తోడుతున్నారు. వరదల సమయాల్లో ఆలయంలోకి నీరు చేరకుండా ఉండేందుకు... 2009లోనే కరకట్ట నిర్మించారు. అయితే కరకట్ట, కల్యాణకట్ట వద్ద లీకేజీలు ఉండటం వల్ల... ఇవాళ ఉదయం నుంచి నీరు ఆలయంలోకి చేరుతోంది.ఆ నీటిని ఎప్పటికప్పుడు అధికారులు మోటార్ల ద్వారా తిరిగి నదిలోకి పంపుతున్నారు.
ఇదీ చూడండి- వైరల్: బాలుడిని చిత్రహింసలు పెట్టిన పోలీసులు