సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో పీఏసీఎస్ ఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
సూర్యాపేటలో కాంగ్రెస్, తెరాస ఘర్షణ..నలుగురికి గాయాలు - Suryapet district today news
పీఏసీఎస్ ఎన్నికల్లో ఓటర్ల విషయంలో లొల్లి మొదలైంది.. అది కాస్తా రెండు పార్టీల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది.
కాంగ్రెస్ పార్టీ బలపర్చిన వెంకట రెడ్డి ఎనిమిదో వార్డులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వెంకట్ రెడ్డి గెలవకుండా ఉండేందుకు తెరస వర్గీయులు ఎనిమిదో వార్డులో సుమారు 12 మంది ఓటర్లను తుఫాన్ వాహనంలో రహస్యంగా తరలించారు. ఆ క్రమంలో కాంగ్రెస్ వర్గీయులు అడ్డుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. మాటమాట పెరిగి కాంగ్రెస్, తెరాస వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఇదీ చూడండి :చిట్యాలలో కాంగ్రెస్ నేతపై తెరాస వర్గీయుల దాడి