హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోట రామారావును గెలిపించి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 2018లో హుజూర్నగర్ శాసనసభ్యులుగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి.. ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. తెరాసకు కాంగ్రెస్ పార్టీ తోక పార్టీగా వ్యవహరిస్తోందంటూ ధ్వజమెత్తారు. నిజామాబాద్లోలాగే హుజూర్నగర్లో కూడాప్రజలు తెరాసకు చరమగీతం పాడి.. భాజపాకు పట్టం కట్టనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
'కాంగ్రెస్ పార్టీ తెరాసకు తోకపార్టీలా వ్యవహరిస్తోంది' - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో బీజేపి అభ్యర్థి కోట రామారావును గెలిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు.
'కాంగ్రెస్ పార్టీ తెరాసకు తోకపార్టీలా వ్యవహరిస్తోంది'