తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉత్తమ్​ కుటుంబానికి సంపూర్ణ మద్దతు ఉంది' - పద్మావతి ప్రచారం

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్​ అభ్యర్థి పద్మావతి ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా మాజీ మంత్రి కొండా సురేఖ ప్రచారంలో పాల్గొన్నారు.

'ఉత్తమ్​ కుటుంబానికి సంపూర్ణ మద్దతు ఉంది'

By

Published : Oct 15, 2019, 12:00 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజక వర్గం చింతలపాలెం మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రేస్ అభ్యర్థి పద్మావతితో కలిసి మాజీ మంత్రి కొండా సురేఖ ప్రచారం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన చేస్తున్నారని పద్మావతి దుయ్యబట్టారు. అసెంబ్లీలో కాంగ్రేస్ ప్రతిపక్షం లేకుండా చేశారని విమర్శించారు. ఖమ్మంలో డ్రైవర్ శ్రీనివాస రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే ఎంఐఎం ​నోరు మెదపకుండా కేసీఆర్​కు కీలు బొమ్మ అయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. ఉత్తమ్ కుటుంబానికి హుజూర్​నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని పద్మావతి ఆశాభావం వ్యక్తం చేశారు.

'ఉత్తమ్​ కుటుంబానికి సంపూర్ణ మద్దతు ఉంది'

ABOUT THE AUTHOR

...view details