కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ను కలిశారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నిలువరించాలని కోరారు. రిటర్నింగ్ అధికారిగా నిజాయితీ ఉన్నవారిని నియమించాలన్నారు. అధికారులపై అధికార పార్టీ నాయకుల ఒత్తిడి లేకుండా చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ అధికారిని పరిశీలనాధికారిగా పంపించాలని విజ్ఞప్తి చేశారు.
అధికార దుర్వినియోగాన్ని నిలువరించండి: కాంగ్రెస్ - congress leaders met election officer of telangana
హుజూర్నగర్ ఉపఎన్నికలో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నిలువరించాలని కాంగ్రెస్ నేతలు కోరారు. హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ను కలిశారు. రిటర్నింగ్ అధికారిగా నిజాయితీ ఉన్నవారిని నియమించాలన్నారు.
రజత్ కుమార్తో కాంగ్రెస్ నేతలు