కరోనా కాలంలో అధికంగా వసూలు చేసిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట డీఈ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పీసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలు ధరించి నిరసన తెలిపారు.
'పేదల కరెంట్ బిల్లులను మాఫీ చేయాలి' - కాంగ్రెస్ నేతల నిరసన
లాక్డౌన్ సమయంలో ఆర్థికంగా నష్టపోయిన నిరుపేద ప్రజలపై రాష్ట్రప్రభుత్వం విద్యుత్తు బిల్లుల భారం మోపడం సరికాదని సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. పెంచిన కరెంట్ బిల్లులను తక్షణమే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

పేదల కరెంట్ బిల్లుల మాఫీ చేయాలి
పెంచిన విద్యుత్తు ఛార్జీలను ఉపసంహరించుకోవాలని కోరారు. కరోనా కష్టకాలంలో నిరుపేద కుటుంబాలకు విద్యుత్ బిల్లులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.