కానిస్టేబుల్‌గా నియమితులైనా... 4,203 మంది టీఎస్ఎస్పీ అభ్యర్థులు శిక్షణకు నోచుకోకుండా పోయారని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు అజీజ్ పాషా సీఎస్ సోమేశ్‌కుమార్‌కు బహిరంగ లేఖ రాశారు. వీరు కాకుండా మిగిలిన 14 వేల మంది సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, జైల్ వార్డర్స్ అభ్యర్థులకు మాత్రమే ప్రభుత్వం శిక్షణ ఇస్తోందని తెలిపారు. టీఎస్ఎస్పీ పోలీస్ అభ్యర్థులకు మాత్రం ఎటువంటి శిక్షణకు సంబంధించిన సమాచారం నేటి వరకు లేదని లేఖలో తెలిపారు.
టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో సీఎస్‌కు బహిరంగ లేఖ - tssp police constable
టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్ల శిక్షణకు సంబంధించి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు అజీజ్ పాషా సీఎస్ సోమేశ్‌కుమార్‌కు బహిరంగ లేఖ రాశారు. ఎంపికైన అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని లేఖ ద్వారా కోరారు.
టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్ల శిక్షణ విషయంలో ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గానీ పట్టించుకోవడం లేదని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, వారు వేరే పని చేసుకుందామంటే ఏదైనా సమస్యలు ఉత్పన్నమై మెడికల్ గా అనుర్హులం అవుతామోనని భయపడుతున్నారని వివరించారు. ఉద్యోగులుగా ఎంపికై కూడా నిరుద్యోగులుగా ఉండటం వల్ల వారి మనోవేదన వర్ణనాతీతంగా ఉందని సీఎస్‌కు లేఖలో తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ స్పందించి సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అజీజ్ పాషా లేఖ ద్వారా విన్నవించారు.
ఇవీ చూడండి: 'ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు అనుమతివ్వాలి'