తెలంగాణ

telangana

ETV Bharat / state

హైకమాండ్​ నిర్ణయానికి కట్టుబడి ఉంటా : జానారెడ్డి - janareddy in kodada

సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి పర్యటించారు. స్థానిక కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో పోటీపై అధిష్ఠానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

పోటీపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: జానారెడ్డి
పోటీపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: జానారెడ్డి

By

Published : Feb 3, 2021, 4:13 PM IST

కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాయని... ఆ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పర్యటించిన ఆయన... స్థానిక కార్యకర్తలతో సమావేశమయ్యారు.

నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించి లక్షలాది ఎకరాలకు నీరందించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని జానారెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో పోటీపై అధిష్ఠానం నిర్ణయం మేరకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

పోటీపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: జానారెడ్డి

ఇదీ చూడండి:ఏ ప్రాంతంలో ఎన్నికలుంటే... ఆ ప్రాంతానికి నిధులా..?: శ్రీధర్​బాబు

ABOUT THE AUTHOR

...view details