తెలంగాణ

telangana

ETV Bharat / state

భాజపా, తెరాస మధ్య చీకటి ఒప్పందం: ఉత్తమ్​

ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఎంపీ ఉత్తమ్... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.

భాజపా, తెరాస మధ్య చీకటి ఒప్పందం: ఉత్తమ్​
భాజపా, తెరాస మధ్య చీకటి ఒప్పందం: ఉత్తమ్​

By

Published : Jan 11, 2021, 7:08 PM IST

Updated : Jan 11, 2021, 8:34 PM IST

కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విశ్వాసం కోల్పోయయన్నారు. ప్రధాని మోదీ ఆయన మిత్రులైన అంబానీ, అదానీ కార్పోరేటు శక్తుల కోసమే కుట్ర పూరితంగా రైతు చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు.

దిల్లీ సరిహద్దులో 50 రోజుల నుంచి చలికి వణుకుతూ, వర్షానికి తడుస్తూ నిరసన తెలియజేస్తున్న రైతులను పట్టించుకోకపోవడం అమానవీయమన్నారు. రైతులు మద్దతు ధర కోసం పట్టుబడుతుంటే భరోసా ఇవ్వకుండా తెరాస ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని ప్రకటించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. నాగార్జునసాగర్​ ఉపఎన్నికలో భాజపాకు డిపాజిట్​ కూడా దక్కదన్నారు. కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

భాజపా, తెరాస మధ్య చీకటి ఒప్పందం: ఉత్తమ్​

ఇదీ చూడండి:పదోన్నతుల విషయంలో ఉద్యోగులకు తీపికబురు

Last Updated : Jan 11, 2021, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details