సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రధాన రహదారి వెంట మంచినీటి పైపులైన్ పనులను కౌన్సిలర్లు అడ్డుకున్నారు. పురపాలికలో అనుమతులు లేని పనులు నడుస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నిలిచిపోవడం వల్ల పనులు కూడా నిలిపివేశారు.
హుజూర్నగర్ పైపులైన్ పనుల్లో గందరగోళం
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ప్రధాన రహదారి వెంట మంచినీటి పైపులైన్ పనులను కౌన్సిలర్లు అడ్డుకున్నారు. ఆ పైపులైన్ పనులు ఎవరు చేస్తున్నారో స్వయంగా కమిషనర్‌కు కూడా తెలియకపోవడం వల్ల గందరగోళం ఏర్పడింది.
పైపులైన్ పనులు, హుజూర్నగర్
అదే సమయంలో అటుగా వెళ్తున్న కమిషనర్ నరేశ్‌రెడ్డిని కౌన్సిలర్లు అడ్డుకున్నారు. పైపులైన్ పనులు ఎవరు చేస్తున్నారో తనకు కూడా తెలియదని, కౌన్సిల్ సమావేశంలో ఈ పనులను ఆమోదించలేదని చెప్పారు. అడ్డదారిలో జరుగుతున్న పనులపై కమిషనర్‌కు కూడా సమాచారం లేకపోవడం వల్ల గందరగోళం ఏర్పిడింది. ఈ విషయమై ఇంజినీరింగ్ విభాగాన్ని సంప్రదించగా.. అది ఆన్లైన్ టెండర్ అని తేలడం వల్ల వివాదం సద్దుమణిగింది.