Conducting Vaikuntha Ekadashi in Suryapet district: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో వైకుంఠ ఏకాదశిసందర్భంగా భక్తులు పలు ఆలయాల్లో స్వామివారిని దర్శించుకున్నారు. మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు వేకువజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరారు. మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ క్షేత్రానికి ఆంధ్ర, తెలంగాణ నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారని చెప్పారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి - సూర్యపేట జిల్లాలో వైకుంఠ ఏకాదశి
Conducting Vaikuntha Ekadashi in Suryapet district: వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పలు చోట్ల వేకువజాము నుంచే ఆలయాల్లో స్వామివారిని దర్శించుకొందామని తరలి వస్తున్నారు. సూర్యపేట జిల్లాలో కొన్ని ఆలయాలకి భక్తులు ఎక్కువగా వస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నామని ఆలయ అధికారులు చెప్పారు.
వైకుంఠ ఏకాదశి సందర్బంగా ఆలయాల్లో భక్తుల సందడి
అదే విధంగా మేళ్లచెరువు మండల కేంద్రంలో శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు వేకువ జాము నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామివారిని దర్శించుకోవడం వలన మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
ఇవీ చదవండి: