వ్యవసాయ బిల్లులకు నిరసనగా దిష్టి బొమ్మ దగ్ధం - వామపక్షాల అప్డేట్స్
కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై వ్యతిరేకత కొనసాగుతోంది. రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ బిల్లులకు నిరసన తెలుపుతూ దిష్టి బొమ్మ దగ్ధం చేశాయి.

వ్యవసాయ బిల్లులకు నిరసనగా దిష్టి బొమ్మ దగ్ధం
కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ బిల్లులకు నిరసనగా సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఎం నాయకులు సంయుక్తంగా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రైతుల పట్ల కేంద్రప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమక్రసీ నాయకులు, మున్నా అశోక్, సీపీఎం కందాల శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.