తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేటకు బయలుదేరిన కల్నల్ భార్య, పిల్లలు - Colonel's santhosh babau latest updates

సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్‌బాబు అమరుడయ్యారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. కల్నల్‌ భార్య, పిల్లలు... దిల్లీ నుంచి శంషాబాద్​కు చేరుకున్నారు.

Colonel's wife and children started suryapet
సూర్యాపేటకు బయలుదేరిన కల్నల్ భార్య, పిల్లలు

By

Published : Jun 17, 2020, 11:21 AM IST

Updated : Jun 17, 2020, 1:11 PM IST

కల్నల్‌ సంతోష్‌బాబు భార్య, పిల్లలు... దిల్లీ నుంచి శంషాబాద్​కు చేరుకున్నారు. సూర్యాపేటకు రోడ్డు మార్గాన కల్నల్‌ భార్య, పిల్లలు బయలుదేరారు. సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్‌బాబు వీరమరణం పొందారు. అమరవీరుడైన సంతోష్​బాబు పార్థీవదేహం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేటకు చేరుకుంటుందని సైబరాబాద్​ సీపీ సజ్జనార్ తెలిపారు. కల్నల్ అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. కల్నల్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇంటి పరిసరాల్లో మున్సిపల్‌ సిబ్బంది క్రిమిసంహారిణి మందులతో పిచికారీ చేస్తున్నారు.

అమరవీరుడైన నాన్నకు వందనం
సూర్యాపేటకు బయలుదేరిన కల్నల్ భార్య, పిల్లలు
Last Updated : Jun 17, 2020, 1:11 PM IST

ABOUT THE AUTHOR

...view details