డ్రాగన్ల దాడిలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు అంతిమ యాత్ర సూర్యాపేటలో ప్రారంభమైంది. విద్యానగర్ నుంచి ఎంజీరోడ్, శంకర్ విలాస్ సెంటర్, రైతు బజార్, పాత బస్టాండ్, కోర్టు చౌరస్తా, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారం వరకు యాత్ర సాగింది. కుటుంబ సభ్యులు, సైనిక దళాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.
కన్నీటి వీడ్కోలు: సూర్యాపేటలో కల్నల్ సంతోష్‌బాబు అంతిమ యాత్ర - Colonel Santosh Babu final journey
కల్నల్ సంతోష్ బాబు అంతిమయాత్ర ప్రారంభమైంది. సూర్యాపేట విద్యానగర్ నుంచి కేసారం వరకు అంతిమయాత్ర సాగింది. కేసారం వ్యవసాయ క్షేత్రంలో సైనిక లాంఛనాలతో కల్నల్ సంతోష్‌బాబు అంత్రక్రియలు జరుగుతున్నాయి.

సంతోష్‌బాబు అంతిమ యాత్ర ప్రారంభం
కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో సంతోష్‌బాబు అంత్యక్రియలు జరుగుతున్నాయి. సైనిక సంస్కారాల ప్రక్రియలో 16 బిహార్ రెజిమెంట్ బృందం పాల్గొంది. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పురపాలిక అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారు.
సంతోష్‌బాబు అంతిమ యాత్ర ప్రారంభం
Last Updated : Jun 18, 2020, 11:27 AM IST