గాల్వన్ లోయలో సూర్యాపేట జిల్లా వాసి కల్నల్ సంతోశ్బాబు వీరమరణం పొంది.. ఈ నెల 15కు ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా కల్నల్ తల్లిదండ్రులు ఈటీవీ-ఈటీవీ భారత్తో తమ మనోవేదన పంచుకున్నారు.
కుమారుడిని కోల్పోయినందుకు తల్లిదండ్రులుగా బాధగానే ఉన్నా.. సంతోశ్బాబు అందరి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నందుకు గర్వంగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. తన త్యాగంతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపాడని అన్నారు.