గల్వాన్ ఘటనలో ప్రాణాలొదిలిన అమర జవాన్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ విరాళం ప్రకటించడం పట్ల కర్నల్ సంతోష్‌బాబు కుటుంబం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంత తక్కువ సమయంలో రూ.5 కోట్ల రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సాయం పట్ల సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల హర్షం - ప్రభుత్వ సాయంపై సంతోష్ బాబు కుటుంబ సభ్యుల హర్షం
గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించడం పట్ల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సహకారం తమకు కొంత ఉపశమనాన్ని ఇవ్వనుందని సంతోష్‌బాబు తండ్రి బిక్కుమల్ల ఉపేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమర జవాన్ల కుటుంబాలకూ ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రకటించడం ముఖ్యమంత్రికి ఉన్న దేశభక్తిని చాటుతోందని సంతోష్‌బాబు తల్లి మంజుల, భార్య సంతోషి అన్నారు. ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తుందని తాము ఊహించలేదంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించిన సీఎం