చైనా దాష్టీకానికి ఎదురు నిలబడి...డ్రాగన్ సైనికులతో పోరాడి అసువులు బాసినకర్నల్ సంతోష్ బాబు....ఏడాదైనా ప్రజల గుండెళ్లో మెదులుతూనే ఉన్నారు. సూర్యాపేటకు చెందిన సంతోశ్‌బాబు చిన్ననాటి నుంచే తండ్రి ఉపేందర్ ప్రోత్సాహంతో సైన్యంలో చేరడమే లక్ష్యంగా చదివారు. కోరుకొండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తైన తర్వాత...నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. ఆ తర్వాత ఇండియన్ మిలటరీ అకాడమీలో సైనిక శిక్షణపూర్తి చేసుకుని ఆర్మీ విధుల్లో చేరారు. 15 ఏళ్ల సర్వీసులో దేశ రక్షణ కోసం అంకితభావంతో పనిచేశారు. 2007లో పాకిస్థాన్ బోర్డర్‌లో ముగ్గురు చొరబాటుదారులను అంతమొందించి దేశ రక్షణలో భాగస్వామ్యమయ్యారు. 2020 జూన్ 15 తెల్లవారు జామున....రెచ్చిపోయి తెగబడిన చైనా సైనికులకు కొదమసింహంలా ఎదురొడ్డి పోరాడి వీరమరణం పొందారు.
తాను పుట్టిన దేశం కోసం...తనను కన్నవాళ్లకు కన్నీళ్లను మిగిల్చారుకర్నల్ సంతోష్‌బాబు. కానీ కొడుకును పోగొట్టుకున్న ఆ క్షణం వారి కళ్లలో బాధను మించిన గర్వం కనిపించింది. ప్రభుత్వం, ప్రజలు మీకు మేమున్నామంటూ వారి కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు. శత్రు సైనికులకు వెన్ను చూపక పోరాడిన సంతోశ్‌బాబుకు......కేంద్ర ప్రభుత్వం మహావీరచక్ర అవార్డుతో సత్కరించింది. ప్రభుత్వం ఆయన కుటుంబానికి గౌరవనీయమైన స్థాయిలో ఆర్ధిక సహకారం అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వారిని పరామర్శించారు. సూర్యాపేట కోర్టు చౌరస్తాలో సంతోష్ బాబు విగ్రహం ఏర్పాటు చేసి... సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు.