తెలంగాణ

telangana

ETV Bharat / state

శిక్షణా కేంద్రంపై విద్యాశాఖ కొరడా - సూర్యపేటలో శిక్షణా కేంద్రం సీజ్‌

కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా విద్యార్థులకు తరగతులు నిర్వహించకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కొందరు వాటిని పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆంక్షలను బేఖాతరు చేస్తూ సూర్యాపేట జిల్లాలో నిర్వహిస్తోన్న ఓ శిక్షణా కేంద్రంపై విద్యాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు.

coaching-centre-was-seized-in-suryapet
శిక్షణా కేంద్రంపై కొరడా ఝుళిపించిన విద్యాశాఖ

By

Published : Dec 18, 2020, 8:31 AM IST

కొవిడ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండల కేంద్రంలోని ఓ శిక్షణా కేంద్రాన్ని మండల విద్యాశాఖ అధికారి చత్రు నాయక్ సీజ్ చేశారు. నవోదయ,గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని నిర్వాహకులు ప్రకటించడంతో విద్యార్థులు క్లాసులకు హాజరయ్యారని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించి శిక్షణ తరగతులు నిర్వహిస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చత్రు నాయక్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details