తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రామాభివృద్ధికై కో ఆప్షన్ సభ్యుడి ఆర్థిక సాయం - కో ఆప్షన్

గ్రామాభివృద్ధి కొరకు గ్రామ కో ఆప్షన్ సభ్యుడు... 7 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు.

గ్రామాభివృద్ధికై కో ఆప్షన్ సభ్యుడి ఆర్థిక సాయం

By

Published : Sep 27, 2019, 7:56 PM IST

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం తాళ్ళసింగారంలో గ్రామ అభివృద్ధి కొరకు గ్రామ కోఆప్షన్ సభ్యుడు పిచిక వీరయ్య 7 లక్షల 50 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. గ్రామంలో నీటి సమస్య అధికంగా ఉన్నందున వాటర్ ట్యాంకర్​ను, ట్రాక్టర్​ను గ్రామ పంచాయతీకి అందించారు. ఈ వితరణ కార్యక్రమాన్ని తుంగతుర్తి శాసన సభ్యలు గాదరి కిషోర్ కుమార్ ప్రారంభించారు. ట్రాక్టర్​ ద్వారా గ్రామంలోని చెత్తను తరలించడమే కాకుండా హరితహారంలో నాటిన మొక్కలకు నీరందించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. దాతల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

గ్రామాభివృద్ధికై కో ఆప్షన్ సభ్యుడి ఆర్థిక సాయం

ABOUT THE AUTHOR

...view details