తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ. 20 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ - cm relief fund cheque distribution at ganugubanda

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని గానుగుబండ గ్రామానికి చెందిన ఎనగందుల కమలాకర్​కు రూ. 20 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కును తెరాస మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి సైదులు అందజేశారు.

cm relief fund cheque distribution at ganugubanda
రూ. 20 వేల విలువైన సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

By

Published : Sep 2, 2020, 7:21 PM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని గానుగుబండ గ్రామానికి చెందిన ఎనగందుల కమలాకర్​ అనారోగ్యంతో బాధపడుతన్నాడు. చికిత్సకు అయిన ఖర్చును తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​కుమార్ సహకారంతో సీఎం సహాయనిధి కింద రూ. 20 వేల చెక్కును తెరాస మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి సైదులుకు అందించారు.

తెరాస ప్రభుత్వం.. పేదల ప్రభుత్వమని చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్శనమని గుడిపాటి సైదులు అన్నారు. పేదవాడికి దూరమైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాంచంద్రారెడ్డి, తెరాస జిల్లా నేతలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :'ఆ గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details