తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు సూర్యాపేటకు సీఎం కేసీఆర్​.. కర్నల్‌ కుటుంబానికి పరామర్శ - కర్నల్ కుటుంబానికి హైదరాబాద్​లో ఇంటిస్థలం

cm kcr went to karnal home on monday
కర్నల్ సంతోష్​బాబు‌ కుటుంబానికి సీఎం పరామర్శ

By

Published : Jun 20, 2020, 4:43 PM IST

Updated : Jun 21, 2020, 3:21 AM IST

16:40 June 20

కర్నల్ సంతోష్​బాబు‌ కుటుంబానికి సీఎం పరామర్శ

కర్నల్ సంతోష్​బాబు‌ కుటుంబానికి సీఎం పరామర్శ

 గల్వన్ లోయలో చైనా సైనికుల చేతిలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని కలుసుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సూర్యాపేటకు వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డితో కలిసి మంత్రి జగదీష్ రెడ్డి-సునీత దంపతులు... సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు.  

రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఉద్యోగ నియామక పత్రం, రూ. 5 కోట్ల చెక్కు, హైదరాబాదులో ఆరు వందల గజాల ఇంటిస్థలం తదితర అంశాలు సంతోష్ బాబు కుటుంబసభ్యులతో మంత్రి చర్చించారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్​ సూర్యాపేటకు రానున్నట్లు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం... యువకులకు స్ఫూర్తిగా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

Last Updated : Jun 21, 2020, 3:21 AM IST

ABOUT THE AUTHOR

...view details