హుజూర్‌నగర్‌లో ప్రజల తీర్పు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. నియోజకవర్గంలో ప్రతిపక్షాలు దుర్మార్గమైన ప్రచారం చేశాయని అన్నారు. కారు గెలుపు పురస్కరించుకొని ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభలో పాల్గొంటానని వెల్లడించారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్ - huzurnagar by election results
హుజూర్‌నగర్‌లో అఖండ మెజార్టీ అందించిన నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు అన్ని ఆలోచించి ఓటు వేశారని స్పష్టం చేశారు. హుజూర్‌నగర్ ప్రజల ఆశలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

cm kcr
Last Updated : Oct 24, 2019, 5:30 PM IST