తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Election Campaign at Thungathurthy : గులాబీ జెండా రాకముందు తెలంగాణ గురించి మాట్లాడితే.. నక్సలైట్లు అనేవారు : కేసీఆర్​

CM KCR Election Campaign at Thungathurthy : ఒకప్పుడు తుంగతుర్తి నుంచి వలసలు పోయే దుస్థితి ఉండేదని.. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని చూస్తే తృప్తి కలుగుతోందని బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​ హర్షం వ్యక్తం చేశారు. గులాబీ జెండా రాకముందు తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడిన.. నక్సలైట్లు అనేవారని ఆవేదన చెందారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న తిరుమలగిరి గ్రామంలో బీఆర్​ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు.

Election Campaign
CM KCR Election Campaign at Thungathurthy

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 4:48 PM IST

Updated : Oct 29, 2023, 6:22 PM IST

CM KCR Election Campaign at Thungathurthy :గులాబీ జెండా రాకముందు తెలంగాణ గురించి ఎవరూ మాట్లాడలేదని.. ఎవరైనా మాట్లాడితే నక్సలైట్లు అని జైల్లో వేసేవారని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న తిరుమలగిరి గ్రామంలో బీఆర్​ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Meeting at Tirmulagiri)లో ఆయన పాల్గొని.. ప్రసంగించారు. ఈ సందర్భంగా పదేళ్ల కాలం నుంచి అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

ఎన్నికల సందర్భం(Telangana Assembly Election 2023)గా జరుగుతున్న సభల్లో చెప్పిన విషయాలపై గ్రామాల్లో చర్చ జరపండని సీఎం కేసీఆర్​ ఓటర్లకు సూచించారు. ప్రజలు విచక్షణతో ఓట్లు వేయాలని.. పార్టీల వైఖరి, చరిత్ర ప్రజలకు తెలుసని అభిప్రాయపడ్డారు. తుంగతుర్తి పోరాటాల గడ్డ.. ఇక్కడ ఎన్ని పోరాటాలు చేసిన ఏ ప్రభుత్వం కనికరం చూపించలేదన్నారు. ఒకప్పుడు తుంగతుర్తి నుంచి వలసలు పోయే దుస్థితి ఉండేదని.. కానీ ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని చూస్తే తృప్తి కలుగుతోందని హర్షించారు. గోదావరి జలాలను పట్టుబట్టి ఇక్కడకు తెచ్చుకున్నామని.. ఇంకా తుంగతుర్తిలో మరికొన్ని ప్రాంతాలకు నీళ్లు రావాల్సి ఉందని చెప్పారు. ఆ మిగిలిన ప్రాంతాలకు నీళ్లు అందించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.

BRS Praja Ashirvada Sabha at Kodad : తెలంగాణ హక్కులను కాపాడేది గులాబీ పార్టీనే : కేసీఆర్​

BRS Praja Ashirvada Sabha at Thungathurthy : కేసీఆర్​ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని పోరాటం చేశానని.. చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించామని సీఎం కేసీఆర్​ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చెరుకు సుధాకర్​ను కాంగ్రెస్​ ప్రభుత్వం జైళ్లో పెట్టిందని గుర్తు చేసుకున్నారు. ఆనాడు ఉద్యమంలో లేని వాళ్లు.. ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్ర ఆదాయం పెరిగే కొద్దీ ప్రజలకు సంక్షేమ పథకాలు పెంచుతున్నామని సీఎం కేసీఆర్​ తెలిపారు. రైతుబంధు పథకాన్ని తేవాలని ఏ ప్రభుత్వం ఆలోచించలేదని.. ఈ పథకాన్ని ఎం.ఎస్​ స్వామినాథన్​ మెచ్చుకున్నారని ఆనందపడ్డారు. తెలంగాణ రాకముందు వలసలు, ఆకలి చావులు ఉండేవన్నారు. కానీ ఇప్పుడో తలసరి ఆదాయంలో తెలంగాణ ప్రథమ స్థానం.. తలసరి విద్యుత్​ వినియోగంలో తామే టాప్​లో ఉన్నామని హర్షించారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయని.. యూపీలో ప్రజలకు అన్నానికే దిక్కు లేదు కానీ... అక్కడి సీఎం వచ్చి తెలంగాణకు పాఠాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

"తుంగతుర్తి గతానికి ఇప్పటికీ చూస్తే ఒక తృప్తి వస్తోంది. గోదావరి జలాలు పట్టుబట్టి తెచ్చుకోగలిగాము.. 1.30 లక్షల ఎకరాలకు నీరు వస్తుంది. రాష్ట్ర ఆదాయం పెరుగుతుంటే సంక్షేమ పథకాలను పెంచుకుంటూ పోయాం. భారతదేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్​ వన్​గా ఉంది. దేశానికే తెలంగాణ తలమానికంగా ఉండడం.. ఎన్నో రాష్ట్రాలను అధిగమించడం జరిగింది. రూ.33 వేల కోట్ల చేపలను ఈ రోజు తెలంగాణ అమ్మింది. ఈ టర్మ్​ గెలిచిన తర్వాత మొత్తం తుంగతుర్తికి దళితబంధు ఇవ్వనున్నాను."- కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధినేత

BRS Public Meeting at thungathurthy :తెలంగాణలో 24 గంటల కరెంటు ఉంటే.. కర్ణాటకలో 5 గంటలు మాత్రమే ఇస్తున్నారని కేసీఆర్​ వివరించారు. ఉద్యమం ప్రారంభ సమయంలో తెలంగాణ సాధిస్తానని ఎవరికీ.. తన మీద నమ్మకం లేదన్నారు. అప్పుడు బీజేపీ, కాంగ్రెస్​లు ఉద్యమంలో పాల్గొనేలేదని చెప్పారు. దేశంలో తొలిసారిగా అల్ట్రా పవర్​ ప్లాంట్​ను దామరచర్లలో ఏర్పాటు చేయబోతున్నట్లు బీఆర్​ఎస్​ అధ్యక్షుడు కేసీఆర్​ ప్రకటించారు.

CM KCR Election Campaign at Thungathurthy గులాబీ జెండా రాకముందు తెలంగాణ గురించి మాట్లాడితే.. నక్సలైట్లు అనేవారు

BRS Public Meeting at Munugode : 'పూటకో పార్టీ మారే వాళ్లకు సిద్ధాంతాలు ఉండవు.. ఉపఎన్నిక ఫలితమే రిపీట్​ కావాలి'

CM KCR Praja Ashirvada Sabha at Achampet : 'కేసీఆర్​ దమ్ము ఏంటో దేశమంతా చూసింది.. కొత్తగా చూపాల్సిన అవసరం లేదు'

Last Updated : Oct 29, 2023, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details