ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ హుజూర్ నగర్లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల తర్వాత నియోజకవర్గ కేంద్రానికి చేరుకోనున్న సీఎం.. పట్టణ శివారులో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల తర్వాత సీఎం పర్యటన ఖరారు కావడం వల్ల ఆగమేఘాల మీద అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. భారీ సంఖ్యలో బలగాల్ని మోహరించారు. ఎన్నికల వ్యయ పరిమితి మించిపోతుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రాక నిర్ణయాన్ని చివరి నిమిషం వరకు తేల్చలేకపోయారు. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని స్వయంగా కేసీఆర్ జిల్లా నేతలకు సమాచారం అందించడం వల్ల అప్పటికప్పుడు ఏర్పాట్లపై దృష్టిసారించారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ భాస్కరన్, నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
నేడు ప్రచారంలోకి దిగనున్న ముఖ్యమంత్రి
నేడు హుజూర్నగర్ ఉప ఎన్నిక కోసం సీఎం కేసీఆర్ ప్రచారం మొదలు కానుంది. మధ్యాహ్నం నియోజకవర్గానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన ఖరారుతో అధికారులు అన్ని రకాల ఎర్పాట్లు చేశారు.
నేడు ప్రచారంలోకి దిగనున్న ముఖ్యమంత్రి
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష
Last Updated : Oct 17, 2019, 8:10 AM IST