మూసికాలువలో రసాయన వ్యర్థాలను వదులుతున్న ట్యాంకర్ను సూర్యాపేట శివారులో పోలీసులు సీజ్ చేశారు. ఈ తెల్లవారు జామున కాలుష్య జలాలను మూసీలోకి వదులుతున్న ట్యాంకర్ను గుర్తించారు. ఏలూరు నుంచి వస్తున్నట్లు ట్యాంకర్ డ్రైవర్ పోలీసులకు తెలిపారు.
పోలీసులు ట్యాంకర్లోని వ్యర్థ జలాలను సీసాలోకి తీసి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు పంపనున్నారు. అయితే ట్యాంకర్ డ్రైవర్ మాత్రం అందులో ఏమి ఉన్నదో తనకు తెలియదని పొంతన లేని సమాధానాలు చెప్పాడు.