సాధారణంగా ఉప్పునిప్పులా ఉండే కుక్క, పిల్లి.. జాతి వైరాన్ని మరచి ప్రాణ స్నేహితుల్లా కలిసి ఒకే కంచంలో తింటూ, ఒకే దగ్గర నిద్రిస్తున్నాయి. వాటి మధ్య ఎంతో స్నేహంగా సాగే ఆట పలువురిని ఆకట్టకుంటోంది. ఈ అరుదైన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో చోటుచేసుకుంది.
కల్మషం లేని మా సయ్యాట చూస్తారా! - సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తాజా వార్తలు
జాతి వైరాన్ని మరచి.. ప్రాణ స్నేహితుల్లా కలిసి ఆడుతున్న కుక్క, పిల్లి ఆట పలువురిని ఆకట్టకుంటోంది. పిల్లి చిన్నతనం నుంచి కుక్కతోనే కలిసి ఉంటూ స్నేహాన్ని కొనసాగిస్తోందని.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లికి చెందిన తుమ్మ అర్వయ్య కుటుంబీకులు చెబుతున్నారు.
కల్మషంలేని మా సయ్యాట చూస్తారా!
మండలానికి చెందిన వెలుగుపల్లి గ్రామంలో తుమ్మ అర్వయ్య ఇంట్లో కుక్క, పిల్లిని పెంచుకుంటున్నారు. పిల్లి చిన్నతనం నుంచి కుక్కతోనే కలిసి ఉంటూ స్నేహాన్ని కొనసాగిస్తోందని వారు చెప్పారు. ఇవి స్నేహంతో ఆడుతున్న సయ్యాట గ్రామస్థులను మంత్రముగ్ధులను చేస్తోంది. జాతి వైరంగల జంతువులే స్నేహంగా మెదులుతుంటే.. మనుషులేమో మానవత్వాన్ని మరిచి జీవిస్తున్నారని గ్రామస్థులు అంటున్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా కేసులు.. ఒకరు మృతి