సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.43వేల నగదు, నాలుగు చరవాణీలు స్వాధీనం చేసకున్నారు. ఓ నివాస గృహంలో ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు పేకాట ఆడుతున్నారన్న సమాచారం డయల్ 100కు వచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు తిరుమలగిరి ఎస్సై డానియల్ తెలిపారు.
పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురిపై కేసు - పోలీసుల అదుపులో పేకాట రాయుళ్లు
పేకాట స్థావరంపై దాడి చేసి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎస్సై డానియల్ తెలిపారు. నిందితుల్లో ప్రజాప్రనిధులు, వ్యాపారస్తులు ఉన్నట్టు సమాచారం.
పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురిపై కేసు