సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో ఈ నెల 14 వరకు విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ చంద్రమల్ల జయబాబు తెలిపారు. వ్యవసాయ పనులు మొదలైన సందర్భంగా బక్రీద్, రాఖీ పౌర్ణమి పండుగలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
నేరేడుచర్లలో లాక్డౌన్ ఎత్తివేత - సూర్యాపేట జిల్లా తాజా వార్త
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 1 నుంచి 14వరకు వివిధ పండుగలు, పెళ్లి ముహూర్తాలు, వ్యవసాయ పనులు ప్రారంభం అవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
cancellation of lockdown at nereducharla in suryapet district
కల్యాణ ముహూర్తాలు ఉన్నందున ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించొద్దనే ఉద్దేశంతోనే లాక్డౌన్ ఎత్తేసినట్టు వెల్లడించారు. వ్యాపారులంతా భౌతిక దూరం పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలని.. మాస్కులు పెట్టుకున్న వారికే సరుకులు అందజేయాలని సూచించారు. వ్యాపార సముదాయాల్లో శానిటైజర్ హ్యాండ్ వాష్‌లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి:'ఆ సమయానికి వ్యాక్సిన్ వస్తుందని నమ్ముతున్నా