తెలంగాణ

telangana

ETV Bharat / state

నేరేడుచర్లలో ఉపఎన్నికల ప్రచారం ప్రారంభం - utham

కాంగ్రెస్‌ తరఫున హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారాన్ని నేరేడుచర్లలో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి ప్రారంభించారు. 30 వేల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం ఖాయమైనట్లేనని ధీమా వ్యక్తం చేశారు.

నేరేడుచర్లలో ఉపఎన్నికల ప్రచారం ప్రారంభం

By

Published : Sep 22, 2019, 12:02 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారాన్ని... నేరేడుచర్ల మండల కేంద్రంలో టీపీసీసీ ఛీప్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ 30 వేల మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారికి ఇవ్వకుండా... ఆంధ్రోళ్లకు తెరాస టిక్కెట్‌ ఇవ్వడం ఏమిటని ఉత్తమ్ ప్రశ్నించారు. ఎన్నికల హామీలు 50శాతం కూడా అమలు కాలేదని విమర్శించారు. సీనియర్‌ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని జానారెడ్డి అన్నారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలను కోరారు.

నేరేడుచర్లలో ఉపఎన్నికల ప్రచారం ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details