తెలంగాణ

telangana

ETV Bharat / state

కత్తులతో పొడిచి, బండరాళ్లతో మోది దారుణ హత్య - brutal murder

కత్తులతో పొడిచి, బండరాళ్లతో మోది దారుణంగా చంపిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.

కత్తులతో పొడిచి, బండరాళ్లతో మోది దారుణ హత్య

By

Published : Oct 22, 2019, 10:32 AM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలం పనిగిరిలో దారుణం చోటుచేసుకుంది. వ్యాపారంలో తగాదాల కారణంగా ఓ వ్యక్తి దారుణంగా చంపేశారు. మృతుడు తిరుమలగిరి మండలానికి చెందిన కొమ్ము యాకయ్యగా గుర్తించారు. కొమ్ము యాకయ్య కొంతకాలంగా హైదరాబాద్​లో ఉంటూ పశువుల వ్యాపారం చేస్తున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు ఆరుగురు పిల్లలు. ఈ నెల 20న సూర్యాపేటలోని ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ వ్యాపారంలో భాగస్వాములైన సురేష్, కొమ్ము చింతయ్యలు యాకయ్యతో గొడవకు దిగారని కుటుంబ సభ్యులు తెలిపారు. వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కత్తులతో పొడిచి, బండరాళ్లతో మోది దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details