BRS Praja Ashirvada Sabha at Kodad in Telangana : కోదాడలో కాళేశ్వరం నీళ్లు రాలేదని భట్టి విక్రమార్క చెబుతున్నారని.. కానీ మూడేళ్లుగా కాళేశ్వరం(Kaleshwaram Project) నీళ్లు ఇక్కడకు వస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్నే శ్రీరామరక్ష.. రాష్ట్ర హక్కులు కాపాడే పార్టీ గులాబీ పార్టీ మాత్రమే అంటూ బదులిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Public Meeting)లో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.
బీఆర్ఎస్ హయాంలో కర్ఫ్యూ, కరవు రాలేదని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ జరగాలని అన్నారు. బీఆర్ఎస్ సాగు నీరు అందివ్వాలని పోరాటం చేస్తోందని.. ఈసారి పంట పొలాలకు సంపూర్ణంగా నీరు అందించే బాధ్యత తనది అంటూ హామీ ఇచ్చారు. ఆనాడు కోదాడలో పంట పొలాలకు నీరు రావాలంటే ధర్నా చేయాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. 24 గంటల్లోగా నీరు ఇవ్వకపోతే 5 లక్షల మందితో ధర్నా చేస్తామంటూ హెచ్చరించామని ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. నాడు తాను మాట్లాడేంత వరకు రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కుల గురించి ఎవరూ మాట్లాడలేదని వివరించారు. కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశానని.. ఆ యాత్ర సమయంలో పంటపొలాలకు నీరు లేక ఇబ్బంది పడేవారని గత రోజులను గుర్తు చేసుకున్నారు.
CM KCR Speech at Paleru Meeting : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్ అంటారు : సీఎం కేసీఆర్
"ఈసారి కోదాడలో బీఆర్ఎస్ను గెలిపించండి. రూ.10 కోట్లతో బీసీ భవనాన్ని నిర్మిస్తాము. ఈ ఏడాదే సాగర్ ప్రాజెక్టు నిండలేదు కానీ.. గత పదేళ్లుగా కరవు లేదు.. కర్ఫ్యూ లేదు. కర్ణాటక నుంచి ఒక పెద్ద లీడర్ వచ్చాడు. కర్ణాటకలో రైతులకు ఐదు గంటల కరెంటు అందిస్తున్నామన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తే ఇక్కడకు వచ్చి ఐదు గంటల కరెంటు ఇస్తున్నామంటే అంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకా ఏమైనా ఉంటుందా?. తెలంగాణలో కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే గ్యారెంటీగా మోసపోవడం ఖాయం."- కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
BRS Election Campaign at Kodad : నాగార్జున సాగర్ ప్రాజెక్టు పేరుకు.. రాష్ట్ర ప్రభుత్వం నందికొండ ప్రాజెక్టుగా పేరు పెట్టుకుందన్నారు. కోదాడలో బీసీకి అవకాశం ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్నే అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షించారు. బీసీ చైతన్యం చూపించాల్సిన బాధ్యత కోదాడ ప్రజలపై ఉందని చెప్పారు. మల్లయ్య యాదవ్ గెలవరు అని చెప్పినా.. కోదాడ టికెట్ ఇచ్చానని.. ఆయనను గెలిపించాల్సిన బాధ్యత బీసీలదే అంటూ సూచించారు. కోదాడలో రూ.10 కోట్లతో బీసీ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఓటు మన భవిష్యత్తుకు అస్త్రమంటూ కేసీఆర్ పేర్కొన్నారు. రైతులకు 24 గంటలు కరెంటు ఇస్తున్న పార్టీ బీఆర్ఎస్ అనీ.. కాంగ్రెస్ మాత్రం 3 గంటల కరెంటు చాలు అంటోందన్నారు.
BRS Praja Ashirvada Sabha at Kodad తెలంగాణ హక్కులను కాపాడేది గులాబీ పార్టీనే : కేసీఆర్ CM KCR Election Campaign in Joint Nalgonda Today : ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు.. నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ సభలు
CM KCR Mahabubnagar Praja Ashirwada Sabha Speech : రైతుబంధు వృథా అంటున్న కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలి : సీఎం కేసీఆర్