సూర్యాపేట జిల్లా మునగాలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక ట్రాక్టర్, ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా... మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మృతుడు మునగాలకు చెందిన మహమ్మద్ సమద్గా గుర్తించారు. మునగాలలో సర్వీస్ రోడ్లో వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బైక్ను ఢీ కొట్టిన ట్రాక్టర్... బాలుడి మృతి - accident at munagala
ద్విచక్రవాహనాన్ని ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టి బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో చోటు చేసుకుంది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
బైక్ను ఢీ కొట్టిన ట్రాక్టర్... బాలుడి మృతి
Last Updated : Oct 1, 2019, 7:54 PM IST