సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున నుంచి మూడురోజులు కొనసాగే ఈజాతరలో భాగంగా నేడు మొదటి రోజున అమ్మవారికి నూతన పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు అలంకరించారు. దూపదీప నైవేధ్యాలను సమర్పించారు.
హుజూర్నగర్లో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగనున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. బోనం సమర్పించడానికి వచ్చే భక్తులు కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
హుజూర్నగర్లో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు
ముత్యాలమ్మ తల్లి ప్రజలందరికీ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలని ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు సమర్పించడానికి వచ్చే భక్తులు కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తులు తీసుకోవాలని.. మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని కార్య నిర్వహణ కమిటీ తెలిపింది.