ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కితవారి గూడెంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పర్యటించారు. భాజపా అభ్యర్థి రామారావును గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్మికులను, ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తూ, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని ఆరోపించారు. కేంద్రం సైతం ఇక్కడ జరిగే పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తోందని తెలిపారు. నిజామాబాద్ లోక్సభ ఫలితాలే.. హుజూర్నగర్లోనూ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, తెరాస పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. నిజామాబాద్లో రైతులు ప్రభుత్వానికి బుద్ధిచెబితే.. హుజూర్నగర్లో సర్పంచులు గుణపాఠం చెబుతారని లక్ష్మణ్ అన్నారు.
హుజూర్నగర్లో నిజామాబాద్ తరహా ఫలితమే.. : లక్ష్మణ్ - BJP STATE PRESIDENT LAXMAN ON RTC STRIKE
హుజూర్నగర్ ప్రజలు స్పష్టమైన మార్పుకోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. కాంగ్రెస్, తెరాస పాలనతో ఓటర్లు విసిగిపోయారని విమర్శించారు.

నిజామాబాద్ ఫలితాలే హుజూర్నగర్లోనూ..: లక్ష్మణ్
నిజామాబాద్ ఫలితాలే హుజూర్నగర్లోనూ..: లక్ష్మణ్
ఇవీచూడండి: హుజుర్నగర్లో సీఎం సభ..ప్రసంగంపైనే ఆసక్తి!