సూర్యాపేటలో డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికులకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని కోరారు. ప్రభుత్వం దసరా సెలవులు పెంచడమే కార్మికుల తొలి విజయమన్నారు. ఉద్యమాలతో ప్రజలను ఏకం చేసిన వ్యక్తి నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి రవాణాశాఖ మంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్రం దృష్టి సారించిందని తెలిపారు.
ఆర్టీసీ సమ్మెపై కేంద్రం దృష్టి సారించింది: లక్ష్మణ్ - cm kcr on rtc strick
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్రం దృష్టి సారించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. సూర్యాపేటలో కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు.
లక్ష్మణ్