తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల చరిత్ర బయటికి రాకుండా కాంగ్రెస్, తెరాస ప్రభుత్వాలు అణచివేస్తున్నాయని ఆరోపించారు. కాలగర్భంలో కలిసిపోతున్న వారి చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని భారతీయ జనతాపార్టీ చేస్తుందని లక్ష్మణ్ తెలిపారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా. లక్ష్మణ్ పర్యటించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివాళులర్పించారు. విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు.
BJP STATE PRESIDENT LAXMAN VISIT THIRUMALGIRI