దేశరక్షణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన కల్నల్ సంతోష్‌బాబు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కల్నల్ సంతోష్‌బాబు పార్థీవదేహానికి ఆయనతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాళులర్పించారు.
ఘర్షణ వాతావరణం వద్దంటూనే చైనా కవ్వింపు చర్యలకు పాల్పపడిందని బండి సంజయ్ మండిపడ్డారు. కల్నల్ సంతోష్‌బాబు పోరాటయోధుడని కొనియాడారు. ఈఘటనకు ప్రతికార చర్య తప్పదన్నారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన సైనికుల త్యాగాలు వృథాకావన్నారు. కల్నల్ సంతోష్‌బాబు దేశం కోసం ప్రాణాలు కోల్పోడం పట్ల ఆయన తల్లిదండ్రులు గర్వంగా ఉన్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు.