తెలంగాణ

telangana

By

Published : Mar 10, 2021, 4:25 AM IST

ETV Bharat / state

కేంద్రం పైసలు లేకుండా రాష్ట్ర పథకాలున్నాయా?: బండి సంజయ్​

పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కోదండరాం పోటీ చేయకుంటే బాగుండేదని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. మేధావి వర్గమంతా ఓటు బ్యాంకుగా ఉండాలన్న సంజయ్.. కోదండరాంను గౌరవించేది తమ పార్టీయేనని వ్యాఖ్యానించారు. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీలు, రాబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని గెలిపిస్తే.. తెరాస దిగివస్తుందని అన్నారు. సూర్యాపేటలో భాజపా నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

bjp state president bandi sanjay comments on trs in jobs in suryapet district
మా పైసలు లేకుండా మీ పథకాలున్నాయా?: బండి సంజయ్​

భాజపా మినహా ఇతరులెవర్ని గెలిపించినా చివరకు కలిసేది తెరాసలోనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ గెలవకపోతే ముఖ్యమంత్రికి అడ్డు అదుపు ఉండదని వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేటలో భాజపా నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రైవేటు విద్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం... యాజమాన్యాల అడుగులకు మడుగులొత్తుతోందని విమర్శించారు. ప్రైవేటు కళాశాలల యజమానుల ద్వారా దొంగ ఓట్లు వేయించేందుకు అధికార పార్టీ యత్నిస్తోందని.. ఇందుకు ఒక్కో ఇంట్లో 10 ఓట్లు ఉండేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. పైసలు మావి ఫొటోలు సీఎంవి అంటూ... కేంద్రం పాత్ర లేని రాష్ట్ర పథకాలు ఏమున్నాయో చెప్పాలని సంజయ్ సవాల్ విసిరారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో కోదండరాం పోటీ చేయకుంటే బాగుండేదని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

పేదల భూములకై పోరాడుతాం:

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలోని భూముల్ని గూండాలు ఆక్రమించుకున్నారంటూ... ఎదిరించేందుకు ఎవరూ ముందుకు రాలేదని, వాటిని తిరిగి పేదలకు అప్పగించేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని సంజయ్ అన్నారు. గిరిజనులు సహా భాజపా నేతలపై కేసులు పెట్టి... బెయిల్ రాకుండా సర్కారు చూస్తోందని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడితోపాటు 20 మంది నెల నుంచి జైల్లోనే ఉన్నారని, వీరితోనే తమ పోరాటం ఆగదని గుర్తు చేశారు. సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ కోసం 400 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా.. బడా నాయకులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించి భూముల రేట్లు పెంచారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అంతకుముందు భాజపా శ్రేణులు.. సూర్యాపేటలోని సంకినేని వెంకటేశ్వర్ రావు నివాసం నుంచి బస్టాండు, పీఎస్ఆర్ సెంటర్ మీదుగా ఫంక్షన్ హాలు వరకు ర్యాలీ నిర్వహించాయి.

కళాకారులను పట్టించుకోవడం లేదు:

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన కళాకారులకు గుర్తింపు లేదని.. అందెశ్రీ, పాశం యాదగిరి వంటి వారిని పట్టించుకోలేదని సంజయ్ విమర్శించారు. తీవ్ర అస్వస్థతలో ఉన్న గూడ అంజన్న సైతం కేసీఆర్​ను చూడాలని కోరికతో ఉన్నా.. ముఖ్యమంత్రి పట్టించుకోలేదని మండిపడ్డారు. అల్లర్లకు కారణమైన భైంసా.. తెలంగాణలో ఉందా లేక పాకిస్థాన్​లోనా అంటూ సంజయ్ ప్రశ్నించారు. హిందువులపై దాడులు జరిగితే రెండు వర్గాల మధ్య కలహాలుగా ప్రచారం చేస్తున్నారని. చివరకు దాడికి గురైన వారినే అరెస్టు చేసి జైళ్లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మా పైసలు లేకుండా మీ పథకాలున్నాయా?: బండి సంజయ్​

ఇదీ చూడండి:గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్న తెరాస

ABOUT THE AUTHOR

...view details