తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస నేతల అండతో భూకబ్జాలు : బండి సంజయ్

భాజపా చేపట్టిన 'చలో గుర్రంపోడు తండా' కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ నేతలు సూర్యాపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. మఠంపల్లి మండలం పెదవీడు పరిధిలో గల గుర్రంపోడు తండాలో.... సాగర్ నిర్వాసితుల భూములను వారు పరిశీలించారు.

bjp;s chalo gurrampodu thanda program in suryapet district
సూర్యాపేటలో చలో గుర్రంపోడు తండా

By

Published : Feb 7, 2021, 11:20 AM IST

సూర్యాపేట జిల్లాలోని గుర్రంపోడు తండాలో తమ భూములు కబ్జాకు గురయ్యాయంటూ గత కొంతకాలంగా పలువురు గిరిజనులు ఆందోళన చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకునేందుకు భాజపా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో భాజపా బృందం గుర్రంపోడుతండాకు బయలుదేరింది.

సంజయ్‌తో పాటు కమలం నేతలు విజయశాంతి, ఎమ్మెల్యే రాజాసింగ్, వివేక్, జితేందర్‌రెడ్డి, విజయరామారావు, రవీంద్రనాయక్, స్వామిగౌడ్‌ ర్యాలీగా వెళ్లారు. గిరిజనుల భూములను పరిశీలించిన భాజపా బృందం... గిరిజనుల ఆందోళనపై వారితో మాట్లాడింది. బాధితులకు అండగా ఉండి న్యాయం చేస్తామని కాషాయ నేతలు హామీ ఇచ్చారు.

సూర్యాపేటలో చలో గుర్రంపోడు తండా

ABOUT THE AUTHOR

...view details