తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు గుర్రంబొడు తండాలో భాజపా ర్యాలీ.. సంజయ్​ హాజరు - తెలంగాణ రాజకీయ వార్తలు

సూర్యాపేట జిల్లాలోని గుర్రంబొడు తండాలో నేడు భాజపా ర్యాలీ నిర్వహించనుంది. గిరిజనులకు మద్దతుగా.. నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాల్గొననున్నారు.

BJP rally in Gurrambodu Tanda
నేడు గుర్రంబొడు తండాలో భాజపా ర్యాలీ.. సంజయ్​ హాజరు

By

Published : Feb 7, 2021, 5:46 AM IST

గుర్రంబొడు తండాలో భారీ ర్యాలీకి భాజపా ఎస్టీ మోర్చా పిలుపునిచ్చింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో తమ భూములు కబ్జాకు గురయ్యాయని కొన్నాళ్లుగా స్థానిక గిరిజనులు ఆందోళన కొనసాగిస్తున్నారు. బాధిత గిరిజనులకు మద్దతుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఇవాళ భారీ ర్యాలీ చేపట్టనుంది.

పోలీసు కేసులు ఎదుర్కొంటున్న గిరిజనులతో మాట్లాడి వాస్తవాలను బండి సంజయ్ తెలుసుకోనున్నారు. గిరిజనుల భూముల్ని తెరాస ప్రభుత్వం కబ్జా చేస్తోందని.. గిరిజనులపై దాడులు పెరిగాయని బండి సంజయ్ ఆరోపించారు.

ఇవీచూడండి:'ఆ.. ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details