తెలంగాణ

telangana

ETV Bharat / state

'గిరిజనుల భూముల జోలికొస్తే ఎన్నిసార్లైనా జైలుకు వెళ్తా' - కోదాడ భాజపా నాయకుడు ఓర్సు వేలంగిరాజు

సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుర్రంపోడు తండా ఘటనలో జైలుకి వెళ్లిన కోదాడ భాజపా నాయకుడు ఓర్సు వేలంగిరాజును బండి సంజయ్ పరామర్శించారు. గిరిజనుల భూముల జోలికొస్తే ఎన్నిసార్లు అయినా జైలుకు వెళ్లడానికి సిద్ధమని తెలిపారు.

'గిరిజనుల భూముల జోలికొస్తే ఎన్నిసార్లైనా జైలుకు వెళ్తా'
'గిరిజనుల భూముల జోలికొస్తే ఎన్నిసార్లైనా జైలుకు వెళ్తా'

By

Published : Mar 17, 2021, 10:03 PM IST

'గిరిజనుల భూముల జోలికొస్తే ఎన్నిసార్లైనా జైలుకు వెళ్తా'

సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం గుర్రంపోడు తండాలోని గిరిజన భూములను కాంగ్రెస్​, తెరాస పార్టీల నాయకులు ఆక్రమించుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. గుర్రంపోడు తండా ఘటనలో జైలుకి వెళ్లిన కోదాడ భాజపా నాయకుడు ఓర్సు వేలంగిరాజును బండి సంజయ్ పరామర్శించారు. గిరిజన రైతులపై పోలీసులతో ప్రభుత్వం లాఠీఛార్జ్ చేయించిందని మండిపడ్డారు.

కేవలం గుర్రంపోడులో అక్రమ షెడ్​ను కూల్చివేస్తేనే భాజపా నాయకుల మీద చర్యలు తీసుకున్న ప్రభుత్వం... గిరిజన ప్రజలపై లాఠీఛార్జ్ జరిగినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గుర్రంపోడు తండాలో జరిగిన ఘటనకు నాగార్జునసాగర్​లో తెరాసకు గుణపాఠం చెబుతామని బండి సంజయ్ తెలిపారు. గిరిజనుల భూముల జోలికొస్తే ఎన్నిసార్లు అయినా జైలుకు వెళ్లడానికి సిద్ధమని తెలిపారు. కోదాడలో ఓర్సు రాజు భవనాన్ని అక్రమంగా కూల్చేశారని... తాము అధికారంలోకి వచ్చాక తెరాస అక్రమాలన్నింటిని బయటపెడతామన్నారు.

ఇదీ చూడండి: సాగర్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే: బండి సంజయ్‌

ABOUT THE AUTHOR

...view details