తెలంగాణ

telangana

ETV Bharat / state

సైదిరెడ్డి గెలిస్తే హుజూర్​నగర్​ను అమ్మేస్తాడు: భట్టి - congress

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో కాంగ్రెస్​ సీనియర్​ నేతలు భట్టి విక్రమార్క, జీవన్​రెడ్డి, శ్రీధర్​బాబులు ప్రచారం నిర్వహించారు. ఈ ఉపఎన్నికల్లో ఉత్తమ్​ పద్మావతి రెడ్డి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సైదిరెడ్డి గెలిస్తే హుజూర్​నగర్​ను అమ్మేస్తాడు: భట్టి

By

Published : Oct 15, 2019, 11:05 PM IST

కాంగ్రెస్ హయాంలోనే హుజూర్​నగర్ సస్యశ్యామలంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి , శ్రీధర్ బాబు తదితరులు ప్రచారం నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ నాయకుల కృషి వల్లే నాగార్జునసాగర్ నిర్మించబడిందని.. దానివల్లే హుజూర్​నగర్ నలుమూలల పచ్చని పైర్లతో కళకళలాడుతూ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. సైదిరెడ్డి గెలిస్తే నియోజకవర్గాన్ని అమ్మటం ఖాయమని ఎద్దేవా చేసారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పది రోజులు దాటుతున్న కేసీఆర్ నుంచి కార్మికులకు ఎలాంటి హామీలు లేవని మండిపడ్డారు. హుజూర్​నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డి గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

సైదిరెడ్డి గెలిస్తే హుజూర్​నగర్​ను అమ్మేస్తాడు: భట్టి

ABOUT THE AUTHOR

...view details