తెలంగాణ

telangana

ETV Bharat / state

భారత్‌ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్న వ్యాపారస్థులు - హుజూర్‌నగర్‌లో భారత్‌ బంద్‌

భారత్ బంద్‌లో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో అఖిల భారత రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ప్రజలు, వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు.

bharat bandh ongoing peacefully in huzurnagar
భారత్‌ బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్న వ్యాపారస్థులు

By

Published : Dec 8, 2020, 10:30 AM IST

భారత్ బంద్‌లో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్‌లో అఖిలభారత రైతు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ బిల్లు సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.

బంద్‌కు మద్దతుగా వ్యాపారస్థులు తమ దుకాణాలు మూసివేశారు. నిరసనలో ప్రజలు, వ్యాపారస్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:బంద్​కు విపక్షాల మద్దతు.. చట్టాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్

ABOUT THE AUTHOR

...view details