రాష్ట్రంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేనమామగా, తండ్రిగా సీఎం కేసీఆర్... ఆడపచులకు చీరెలను కానుకగా అందిస్తున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
'రాష్ట్ర ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఇస్తున్న పండుగ కానుక' - 'రాష్ట్ర ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఇస్తున్న పండుగ కానుక'
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో బతుకమ్మ చీరలను ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పంపిణీ చేశారు. విభిన్నమైన రంగుల్లో 287 డిజైన్లతో కోటి బతుకమ్మ చీరలు తయారు చేసినట్లు పేర్కొన్నారు.
!['రాష్ట్ర ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఇస్తున్న పండుగ కానుక' bathukamma sarees distributed by mla gadari kishore kumar in thungathurthi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9114639-48-9114639-1602249518924.jpg)
bathukamma sarees distributed by mla gadari kishore kumar in thungathurthi
ఈ ఏడాది రూ.317 కోట్లను ఈ కార్యక్రమం కోసం కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వేల చేనేత కుటుంబాలు 26 వేల మగ్గాలపై 8 నెలల వ్యవధిలో విభిన్నమైన రంగుల్లో 287 డిజైన్లతో కోటి బతుకమ్మ చీరలు తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 17 వరకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.